NTV Telugu Site icon

Buchi Babu Sana: మహేశ్‌ని చూశాకే ఆ విషయం తెలిసింది

Buchi Babu Sana

Buchi Babu Sana

‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా.. మహేశ్ బాబుపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఆయన్ను చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారన్న విషయం తనకు అవగతమైందన్నాడు. 1: నేనొక్కడినే సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశానని, ఓ రోజు సెట్స్‌లో ఉన్నప్పుడు మహేశ్ కారు దిగి, జుట్టు సవరించుకుంటూ వస్తోంటే తాను చూసి ఫిదా అయ్యానని అన్నాడు. అప్పుడే అబ్బాయిలు అందంగా ఉంటారని తాను తెలుసుకున్నానని, అప్పటివరకూ అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారని తాను భ్రమలో ఉండేవాడినన్నాడు.

నేనొక్కడినే సినిమా సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ మహేశ్ అంతే అందంగా ఉన్నాడని బుచ్చిబాబు పేర్కొన్నాడు. వేరే వాళ్ళ సినిమాల సెట్‌కి వెళ్ళినప్పుడు షూటింగ్ చూస్తామని, కానీ మీ సినిమా సెట్‌కి వెళ్తే మాత్రం మిమ్మల్నే చూస్తామంటూ గట్టిగా పులిహోర కలిపేశాడు. ఇక కొన్ని సినిమాలు హిట్ అవుతాయని ముందే తెలిసిపోతాయని, ‘సర్కారు వారి పాట’ కూడా అదే కోవకి చెందిందన్నాడు. ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమనిపించిందని అభిప్రాయపడ్డాడు. పాటలు గానీ, ట్రైలర్‌లో చూపించిన ఫైట్ సీన్స్ గానీ చాలా బాగా వచ్చాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా తమన్ పాటలు అదరగొట్టేశాడన్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని, చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ అని చెప్తూ బుచ్చిబాబు తన ప్రసంగాన్ని ముగించాడు.