Site icon NTV Telugu

Bubblegum: సుమ కొడుకు మొదటి సినిమా.. ఓటిటీలో వచ్చేది ఎప్పుడంటే.. ?

Roshan

Roshan

Bubblegum: యాంకర్ సుమ కొడుకు రోషన్ గతేడాది బబుల్‌గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. క్షణం , కృష్ణ అండ్ హిజ్ లీల వంటి చిత్రాలను తీసిన మాస్ట్రో డైరెక్టర్ రవికాంత్ పెరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. డిసెంబర్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ న్యూ ఏజ్ లవ్ డ్రామాగా వచ్చిన బబుల్‌గమ్ సినిమా ఇప్పుడు ఆహాలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహాలో బబుల్‌గమ్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించేశారు. బబుల్‌గమ్ సినిమా ఆదిత్య ప్రేమకథను ఎంతో అందంగా ఆవిష్కరించింది. మాంసం దుకాణం యజమాని, అతని భార్య, డీజే అంటూ పనీ పాట లేకుండా తిరిగే కొడుకు ఇలా ఎన్నో ఆసక్టికరమైన పాత్రలతో ఓ మిడిల్ కాస్ల్ ఫ్యామిలీని చక్కగా చూపించారు.

మానస చౌదరి పోషించిన ఝాన్వి పాత్ర ప్రేక్షకులపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఆదిత్య, ఝాన్వీ ప్రపంచాలు వేర్వేరు. అలాంటి వారిద్దరికీ ప్రేమ ఎలా చిగురించింది? ఆ తరువాత ఏం జరిగింది? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చివరకు ఏం చేశారు? అన్న ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.”హబీబీ జిలేబి,” “ఇజ్జత్,”, “ఈజీ పీజీ” వంటి ట్రాక్‌లతో శ్రీచరణ్ పాకాల ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేశారు. పాటలు, ఆర్ఆర్ అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు.. ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్. థియేటర్ లో మంచి పాజిటివ్ బజ్ ను అందుకున్న ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version