Ketika Sharma: ‘బ్రో’ మెసేజ్ ఉన్న సినిమా.. ఆ ఐదు నిమిషాలు మాత్రం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bro Movie Heroine Ketika Sharma Special Interview: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోగా ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ తాజాగా విలేకర్లతో మాట్లాడుతూ బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆ విశేషాలు మీ కోసం
Pawan Kalyan: ఇక ఆ రెండు సినిమాలు ఎన్నికలయ్యాకే.. కానీ ఓజీ మాత్రం సంక్రాంతి బరిలోకి?
Also Read
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
బ్రో ఒరిజినల్ మూవీ చూశారా? రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి?
బ్రో ఒరిజినల్ మూవీ చూశాను, అందులో కంటే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. బ్రోలో హీరోయిన్ అంటే నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది, వినోదంతో పాటు వివిధ హంగులు జోడించి, ఒరిజినల్ కంటే మరింత అందంగా మలిచారు.
బ్రో సినిమా ఒప్పుకోవడానికి ప్రధానం కారణం?
బ్రో సినిమా ఒప్పుకోవడానికి ప్రధానం కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరు వింటే చాలు, సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు నిజానికి పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో కలిసి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు, మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించింది.
సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నేను సాయి ధరమ్ తేజ్ గారు పోషిస్తున్న మార్క్ కి లవర్. సినిమాకి ముఖ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర, నాదే కాదు సినిమాలోని ప్రతి పాత్ర కథని ముందుకు నడిపించేలా ఉంటుంది. అనవసరమైన పాత్రలు గానీ, సన్నివేశాలు గానీ లేకుండా ఆసక్తికర కథాకథనాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగుతుంది. ఇదొక మెసేజ్ ఉన్న సినిమా ఈ తరహా సినిమాలో నటించే అవకాశం రావడం నాకు ఇదే మొదటిసారి. నా గత చిత్రాలతో పోలిస్తే ఇది విభిన్న చిత్రం, నటిగా మరింత మెరుగు పడటానికి సహాయపడింది.
మీ గత చిత్రం వైష్ణవ్ తేజ్ తో చేశారు, ఇప్పుడు వెంటనే ఆయన అన్న సాయి ధరమ్ తేజ్ తో నటించడం ఎలా ఉంది?
ఇది యాదృచ్చికంగా జరిగింది, ‘రంగ రంగ వైభవంగా’ చివరి దశలో ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. ఎంతో ఆసక్తికర కథ, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి కలయికలో వస్తున్న మొదటి సినిమా కదా అందుకే ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు అనుకున్నాను.
సెట్స్ లో వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎలా ఉండేవారు
ఇద్దరూ మంచి వ్యక్తులు, అందరితో సరదాగా ఉంటారు, వైష్ణవ్ కొంచెం మొహమాటస్తుడు కానీ ఒక్కసారి పరిచయం అయ్యాక చాలా సరదాగా ఉంటాడు. వాళ్ళ అన్న సాయి ధరమ్ తేజ్ అందరితో బాగా కలిసిపోతాడు.
మీ పాత్ర కోసం ఎలాంటి కసరత్తు చేశారు?
ఒరిజినల్ మూవీతో పోలిస్తే ఇందులో నా పాత్ర ప్రాధాన్యత ఎక్కువ, ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. బ్రో సినిమా స్క్రిప్ట్ చక్కగా కుదిరింది, దానికి తగ్గట్టుగా నటిగా నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేశాను. సముద్రఖని గారు ఫాస్ట్ డైరెక్టర్, ఆయన ఎక్కువ టేక్స్ తీసుకోరు, తక్కువ టేక్స్ లోనే మన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబడతారు. ఆయనకు ఏం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు, ఆయన చాలా తెలివైన దర్శకుడు. త్రివిక్రమ్ గారి అద్భుతమైన రచన కూడా ఈ సినిమాకి తోడైంది కాబట్టి నేను ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సిన అవసరం రాలేదు.
జాణవులే పాటలో మీరు చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఆ పాట గురించి చెప్పండి?
జాణవులే పాటలో నాకు నీతా లుల్లా గారు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు, నా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఆమెకు క్రెడిట్ దక్కుతుంది. జాణవులే పాట ఇచ్చిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను, అద్భుతమైన విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ సాంగ్ ద్వారా మొదటిసారి నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది, సినిమాలో కూడా సంగీతం బాగుంటుంది.
పవన్ కళ్యాణ్ గారిని మొదటిసారి కలవడం ఎలా అనిపించింది?
పవన్ కళ్యాణ్ గారితో నేరుగా వెళ్లి మాట్లాడాలంటే కాస్త భయమేసింది, సాయి ధరమ్ తేజ్ గారికి చెప్తే నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ కలవలేకపోయాను కానీ ఆరోజు ఆయనతో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మాత్రం మంచి అనుభూతిని ఇచ్చింది.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?
జయాపజయాలు మన చేతుల్లో ఉండవు కదా మన వరకు సినిమా కోసం ఎంత కష్ట పడగలమో అంత కష్టపడాలి. ఇలాంటి గొప్ప అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను, ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి?
ఈ బ్యానర్ లో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది, ప్రతి ఆర్టిస్ట్ విషయంలో ఎంతో కేరింగ్ తీసుకుంటారు. ఈ ప్రొడక్షన్ లో చాలా కంఫర్టబుల్ గా పని చేయగలిగాను.
మెగా హీరోలతో ఇంకా సినిమాలు ఏమైనా చేస్తున్నారా?
ఆహా స్టూడియోస్ కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను కానీ ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ వివరాలు చెప్పలేను. ప్రస్తుతానికి అయితే మెగా హీరోలతో కొత్త సినిమాలు చేయడం లేదు కానీ అవకాశం వస్తే మాత్రం సంతోషంగా చేస్తాను.
మీ డ్రీమ్ రోల్ ఏంటి?
ఎవరైనా ప్రముఖుల బయోపిక్ లో నటించాలని ఉంది, అలాంటి నిజ జీవిత పాత్రలు ఛాలెంజింగ్ గా ఉంటాయని నమ్ముతాను.
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!