Site icon NTV Telugu

Britney Spears: తన నగ్న ఫోటోలు షేర్ చేసిన పాప్ సింగర్.. ఫ్యాన్స్ ఫైర్

Britney

Britney

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాటలకు ఫిదా కానీ సంగీత అభిమాని లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాటలంటే చెవులు కోసేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే ఆమె తన స్వతంత్రాన్ని తిరిగి తెచ్చుకొంది. కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీ 13 ఏళ్లపాటు తండ్రి జెమీ స్పియర్‌ సంరక్షణలో ఉన్న అమ్మడు కొన్నేళ్లు కోర్టులో గట్టిగా పోరాడి ఈ మధ్యనే కేసు గెలిచి తండ్రి చెరనుంచి బయటపడింది. ఇక ఆ కేసు కొట్టివేసిన దగ్గరనుంచి బ్రిట్నీ సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో కలిసి మెక్సికో లో నివసిస్తున్న ఈ భామ సోషల్ మీడియా లో యమా యాక్టివ్ గా ఉంటున్న విషయం విదితమే.

నిత్యం బాత్ రూమ్ లో దిగినవి, హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకొంటూ ఉంటుంది. ఇక తాజాగా బ్రిట్నీ తన లిమిట్స్ ను క్రాస్ చేసిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె తన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. అందులో ఒంటిపై ఏమాత్రం బట్టలు లేకుండా కేవలం రెండు చేతులు అడ్డుపెట్టుకొని నిలబడింది. అంతేకాకుండా ఆ ఫోటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. నా కడుపులో బేబీ ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అంటూ చెప్పుకురావడంతో ఆమె తల్లి కాబోతుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరో పక్క ఈ ఫోటోలపై ఆమె ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. ఇలా చేస్తుంది కాబట్టే తన తండ్రి అంతలా హింసించి ఉంటాడు.. అని కొందరు.. ఆమె మానసిక స్థితి బాలేదనుకుంటా .. అందుకే తండ్రి తన సంరక్షణలో ఉంచుకున్నాడని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version