Breaking: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తనే తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎపప్టినుంచో రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి. విజయ్ ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న విషయం తెల్సిందే. విద్యార్థులను మీట్ అవ్వడం, వారికి బహుమతులు ఇవ్వడం, ఇక విజయ్ ఫ్యాన్స్ స్థాపించిన పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడంతో ఆయన రాజకీయాలను సీరియస్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై విజయ్ అభిమానులు స్పందిస్తూ.. ఆయన పార్టీ పెట్టడం ఖాయమే అని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా విజయ్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే విజయ్.. పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం. చెన్నై నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుందట.
Nisha Noor: స్టార్ హీరోయిన్.. వ్యభిచారిగా మారి.. చివరికి ఎయిడ్స్ తో ..
అసలు అయితే.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. మొత్తం సినిమాలు ఆపేసిన తరువాత ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ షూటింగ్ ను ఫినిష్ చేశాడు విజయ్. ఇక ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ పాదయాత్ర మాత్రం లియో రిలీజ్ కు ముందే చేయనున్నాడట. ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఈ మూడు నెలల మధ్యలోనే మొదలుకానుందట. విజయ్ కు అభిమాన గళం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ పాదయాత్ర మొదలైతే వారు చేసే రచ్చ అంతాఇంతా కాదు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.