Site icon NTV Telugu

Bramayugam: ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా మమ్ముట్టి ‘భ్రమయుగం’

Bramayugam

Bramayugam

‘Bramayugam’ Releasing Worldwide on February 15 2024: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా భ్రమ యుగం అనే ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని మలయాళం నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాని ఫిబ్రవరి 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ నైట్ షిఫ్ట్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ “ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్” కాగా, కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ ఆంటో జోసెఫ్ కి సంబంధించిన “AAN మెగా మీడియా”. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ జనవరి 26, 2024న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేసిన సౌండ్‌ట్రాక్‌తో ఈ సినిమా మార్కెటింగ్ ప్రమోషన్స్ ప్రారంభించింది.

Animal: ‘యానిమల్’లో నాన్న అనే పదం ఎన్ని వందల సార్లు ఉపయోగించారో తెలుసా?

ఇక ‘భ్రమ యుగం’ అనేది మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ స్వయంగా దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మక నిర్మితమవుతున్న మలయాళ చిత్రం. ఈ బ్యానర్ ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ప్లాన్ చేయబడిన నిర్మాణ సంస్థ అని చెబుతున్నారు. ఈ క్రమంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ – వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘భ్రమయుగం’ భారీ స్థాయిలో చిత్రీకరించబడింది. చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు.

Exit mobile version