NTV Telugu Site icon

Brahmastra: నాలుగు రోజుల ప్రత్యేక ఆఫర్.. రూ.100కే బ్రహ్మాస్త్ర టిక్కెట్

Brahmastra

Brahmastra

Brahmastra: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్‌లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా తొలి మూడు రోజులు ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి ఈ మూవీని వీక్షించారు. ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాగా వచ్చి భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది. అయితే సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లోనూ రూ.75కే టికెట్లు విక్రయించగా ఆరోజు థియేటర్లలో 85 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

Read Also: FNCC Elections Results: ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో బండ్ల గణేష్ ఓటమి.. అధ్యక్షుడిగా కృష్ణ సోదరుడు..

ప్రస్తుతం వసూళ్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టికెట్ రేటు తగ్గిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని సినిమా యూనిట్ భావిస్తోంది. దీంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు సినిమాను కేవలం రూ.100కే చూసే అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బ్రహ్మాస్త్ర మూవీకి క‌ర‌ణ్ జోహార్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఇంకా ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేదని.. ఇంకా రూ.40-50 కోట్లు రాబట్టాల్సి ఉందని సమాచారం అందుతోంది.