బాలీవుడ్ బాక్సాఫీస్ కష్టాలకి దాదాపు ఎండ్ కార్డ్ వేసి పాన్ ఇండియా మొత్తం మంచి కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్’. రణబీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా 450 కోట్లకి పైగా రాబట్టింది. హిందూ మైథాలజీలోని అస్త్రాలన్నీ కలిపీ అస్త్రావర్స్ గా మార్చి అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ట్రయోలజీ చేస్తున్నట్లు అనౌన్స్ చెయ్యగానే బాలీవుడ్ నుంచి ఒక హ్యూజ్ స్పాన్ ఉన్న సినిమా బయటకి వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మరు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ సినిమా కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తున్న సమయంలో అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సినిమా రిలీజ్ 2026లోనే అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సినిమాని అయాన్ ఎందుకు ఇంత డిలే చేస్తున్నాడా అని సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే అయాన్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 డిలే చెయ్యడం వెనక ఉన్న అసలు కారణం ‘హృతిక్ రోషన్’ అని బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న మాట. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘వార్’ సినిమా నార్త్ లో సూపర్ హిట్ అయ్యింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా షూటింగ్ అయిపోగానే ‘వార్ 2’ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ యాక్షన్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ అయాన్ ముఖర్జీకి వెళ్లింది. ఈ కారణంగానే అయాన్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2ని డిలే చేస్తున్నాడని సమాచారం. మరి వార్ 2 సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు అనే వార్తలో నిజమెంత అనేది తెలియాలి అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.