Site icon NTV Telugu

Brahmanandam : ఆయన వల్ల స్టేజిపైనే ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?

Brahmanandam

Brahmanandam

Brahmanandam : కామెడీ లెజెండ్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాల్లో కామెడీతో నవ్వించి చంపే ఆయన.. స్టేజిపై మాట్లాడితే విన్న వాళ్లు ఎమోషనల్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి ఆయన మాటలు. కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించే బ్రహ్మానందం.. స్టేజిపై ఏడ్చిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే తాజాగా ఓ ప్రోగ్రామ్ లో అందరిముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే అందరికీ షాకింగ్ గా అనిపించింది. బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించేశారు. ఈ క్రమంలోనే ఆహాలో లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు గెస్ట్ గా వచ్చారు. ఇందులో తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు బ్రహ్మానందం.

Read Also : Bunny Vasu : బుక్ మై షో రేటింగ్స్ ఇవ్వడం మానేయాలి.. బన్నీ వాసు సూచన

ఇక ఆయన గెస్ట్ గా వచ్చిన సందర్భంగా బ్రహ్మానందం ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో చివర్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మీకుఉన్న అనుబంధం ఏంటి అని హోస్ట్ అడగ్గా.. బ్రహ్మానందం చెబుతూ ఎమోషనల్ అయ్యారు. చివర్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎస్పీబీతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన నాకు కుటుంబ సభ్యుడిలాంటి వాడు అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు బ్రహ్మానందం. దీంతో ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. బ్రహ్మానందం చాలా వరకు స్టేజిపై ఇలా కన్నీళ్లు పెట్టుకోరు. తనదైన కామెడీతో నవ్విస్తారు లేదంటే తన స్పీచ్ తో అందరినీ ఎమోషన్ అయ్యేలా చేస్తారు. కానీ ఆయన ఎమోషన్ కావడం చాలా అరుదు.

Read Also : Radhika Apte : హీరోల కోసమే సినిమాలు చేస్తారా.. రాధిక ఆప్టే ఫైర్

Exit mobile version