Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎంత సింపుల్ గా ఉంటారో.. తన సిద్ధాంతానికి అంతే కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమా ప్రెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. దీనికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందులో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆర్.నారాయణ మూర్తి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన్ను ఎంతో మంది ప్రలోభపెట్టినా సరే దేనికీ లొంగలేదు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. నారాయణ మూర్తి ప్రజల కోసం ఎన్నో పనులు చేశాడు. ఆయన తీసిన సినిమాలు ప్రజల కోసమే చేశాడు.
Read Also : Bejawada Bebakka : కోట్లు పెట్టి ఇల్లు కొనేసిన బిగ్ బాస్ బ్యూటీ..
ఇప్పటికీ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఆయన ఉన్నన్ని రోజులు ప్రజల కోసమే పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాను కూడా మీ కోసమే తీశాడు. ఇందులో కొన్ని డైలాగులు మనసును హత్తుకుంటున్నాయి. చదువుగురించి ఇందులో అద్భుతంగా చూపించారు. ఆర్.నారాయణ మూర్తి అంటే నేను చూస్తున్నప్పటి నుంచి అదే ప్యాంటు, షర్టు, అదే ఆటో. అందుకే నారాయణ మూర్తి అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అతనిలాగా నేను సేవా కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అతనిలాగా ఎవరూ చేయలేరు కూడా అంటూ తెలిపాడు బ్రహ్మానందం. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. బ్రహ్మానందం ఎంతో విద్యావంతుడు. లెక్చరర్ కూడా. అందుకే ఈ సినిమాను ఆయనకు చూపించాను. ఆయన్ను ఇక్కడకు పిలిచాను. ఆయన మాటలు వింటే నాకు సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు బ్రహ్మానందం.
Read Also : Nagarjuna : ఆయన కోసం పార్కుల చుట్టూ తిరిగా.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
