NTV Telugu Site icon

Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మీ.. ఎంత అద్భుతంగా చేశాడో..

Brahmi

Brahmi

Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా.. తాజాగా ఆయన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసి, ఆయన గురించి అద్భుతంగా చెప్పి.. అందరిని ఏడిపించేశారు. తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో బ్రహ్మీ.. ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ..ఆయనలా ఇమిటేట్ చేసి అందరిని కాసేపు సరదాగా నవ్వించారు. అనంతరం ఏఎన్నార్ ఎంతటి గొప్ప వ్యక్తినో తన మాటల్లో చెప్పుకొచ్చారు.

Mahesh Babu: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో మహేష్ బాబు

” ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఎలా మాట్లాడేవారు.. ఎలా నడిచేవారు.. ఎలాంటి బట్టలు వేసుకునేవారు.. ఇలాంటివి అన్ని చూసి.. పిచ్చిపిచ్చిగా మేము ఇమిటేట్ చేసేవాళ్ళం. ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద స్నేహశీలి అని చెప్పడానికి అంటే .. సర్కస్ లో సింహాలు ఉంటాయి.. పులులు ఉంటాయి.. వెంకయ్య నాయుడు గారిలాంటివారు ఉంటారు.. అంతకన్నా గంభీరమైన వ్యక్తులు ఉంటారు. నాలాంటి కోతులు.. బపూన్స్ కూడా ఉంటారు. కాబట్టి మేము చెప్పే మాటల్లో కొన్ని చిలిపి మాటలు కూడా ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు.. ఆయనకు కారం అంటే బాగా ఇష్టం. కడుపు తీపి.. ఎక్కడదమ్మా ఆ కడుపుతీపి.. అంటూ ఏఎన్నార్ వాయిస్ ను మిమిక్రీ చేసి అందరిని అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments