Brahma Mudi: ఎంతో ఫేమస్ అయ్యిన సీరియల్ ఒక్కసారిగా రావడం లేదు అంటే ప్రేక్షకులు ఎంత బాధపడతారో అందరికి తెల్సిందే. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ ఎండ్ అవుతుంది అని తెలిసీ ఎంతోమంది మహిళలు కంటనీరు పెట్టుకుంటూ అప్పుడే ఎండ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చిన విషయం కూడా తెల్సిందే. ఇక మరోపక్క అదే సమయానికి వచ్చే కొత్త సీరియల్ ఎలా ఉంటుంది..? కార్తీక దీపం లా ఎడిక్ట్ అవ్వొచ్చా..? ఆ సమయానికి మరో సీరియల్ ను వెతుక్కోవాలా..? అనే ఆలోచన కూడా ఉంటుంది. కార్తీక దీపం లాంటి హిట్ సీరియల్ తరువాత ఆ సమయంలో వచ్చిన సీరియల్ బ్రహ్మముడి. బిగ్ బాస్ ఫేమ్ మానస్, దేవిక అనే కొత్త హీరోయిన్ జంటగా కనిపించగా.. చెల్లెలి కాపురం, గుప్పెడంత మనసు లాంటి హిట్ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన కుమార్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహించాడు. ఈ సీరియల్ కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రమోషన్స్ చేయడం విశేషం.
Rama Prabha: నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?
ఇక మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో.. అని భయంభయంగా చూసిన ప్రేక్షకులకు.. కార్తీక దీపాన్ని మరిపించే కథ ఉండడంతో మంచి సీరియల్ నే ఎన్నుకున్నామని నమ్మకం వచ్చేసింది. రిచ్ లొకేషన్స్.. డైరెక్టర్ కుమార్ టేకింగ్.. మానస్- దేవిక పెయిర్.. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చేశాయని చెప్పుకొస్తున్నారు.ఇక బ్రహ్మముడి స్ట్రీమింగ్ అయిన మొదటి వారంలోనే మంచి రేటింగ్ ను సంపాదించుకుంది. రెండేళ్లగా ఏ సీరియల్ అందుకొని రేటింగ్ ను బ్రహ్మముడి అందుకొంది. టీవీ సీరియల్ రేటింగ్స్ 8.7 అందుకొని టాప్ ప్లేస్ లో నిలబడింది. అంతకుముందు కార్తీక దీపం రేటింగ్ కూడా టాప్ ప్లేస్ లోనే ఉండేది అని అందరికి తెల్సిందే.. ఇక దీంతో మహిళలు, సీరియల్ లవర్స్.. పర్లేదు భయ్యో.. ఇది కూడా మరొక కార్తీక దీపం అయ్యేలా ఉంది అని కొందరు.. కార్తీక దీపం ఫ్యాన్స్ అందరు ఇప్పుడు బ్రహ్మముడి ఫ్యాన్స్ అయిపోతున్నారు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ రేటింగ్ ను ఈ సీరియల్ ముందు ముందు కాపాడుకుంటుందో లేదో చూడాలి.
