Brad Pitt: అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు బ్రాడ్ పిట్. ఏంజెలినా జోలీతో విడిపోయిన దగ్గర నుంచీ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. అంటే దానర్థం మరెవరినీ పెళ్ళి చేసుకోలేదనే. అంతే కానీ, అమ్మాయిలతో కాలక్షేపం చేయడం మాత్రం మానలేదు. ఈ అందగాడు లాస్ ఫెలిజ్ లోని తన విలాసవంతమైన భవనాన్ని అమ్మేస్తున్నాడట! దాదాపు రెండు ఎకరాలు ఉండే ఆ స్థలాన్ని 40 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.329 కోట్ల రూపాయలట! అదే భవనంలోనే బ్రాడ్ పిట్, అతని మాజీ భార్య ఏంజెలినా జోలీ తమ ఆరుమంది పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారి కోసమే బ్రాడ్ తన ఇంటిని అమ్ముతున్నట్టు సమాచారం!
Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు
ఏంజెలినా జోలీతో బ్రాడ్ పిట్ విడాకులు 2019లోనే తీసుకున్నాడు. అయినప్పటికీ తమ పిల్లల కోసం వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. పిల్లలను జీవితంలో పైకి తీసుకు రావాలనే ఒప్పందంతోనే తమ ఉమ్మడి ఆస్తులను అమ్మే దిశగా సాగుతున్నారని సమాచారం. లాస్ ఫెలిజ్ లోని భవంతి అమ్మకం కాగానే, తాము ఎంతో ఇష్టపడి కొన్న ‘షెటావు మారివల్ ఎస్టేట్’ను కూడా అమ్మకానికి పెట్టనున్నారని తెలుస్తోంది. అది కూడా మంచి రేటుకు పోతే, పిల్లలకు ఒక్కొక్కరికి మన కరెన్సీలో వంద కోట్లయినా ఇవ్వాలని బ్రాడ్, ఏంజెలినా నిర్ణయించారని వినికిడి. బ్రాడ్ తన ఇల్లు అమ్మేసిన తరువాత లాస్ ఏంజెలిస్ లో ఏదైనా చిన్న ఇంట్లోకి మకాం మార్చనున్నట్టు తెలుస్తోంది. అక్కడే బ్రాడ్ పిట్ తన ప్రేమాయణాలూ సాగిస్తాడనీ హాలీవుడ్ జనం అంటున్నారు.
