Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” కొత్త ప్రోమో… ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్న టీమ్

RRR

RRR

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానుంది. అయితే అప్పటిదాకా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆగాల్సిందే. అయితే వారి ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు మేకర్స్ వరుస అప్‌డేట్లతో వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు రాబోతున్న సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎదో ఒక అప్‌డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను పంచుకున్నారు. రామ్ చరణ్ లుక్, సీతగా అలియా భట్ ప్రిపరేషన్, అజయ్ దేవగన్ పాత్ర పెద్దగా రివీల్ కానప్పటికీ అది పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఆ వీడియోలలో తెలిపారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ సినిమా నుంచి హీరోలకు సంబంధించిన మరో పవర్ ప్యాక్డ్ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరెండు ప్రోమోలు ట్రెండ్ అవుతున్నాయి.

Read Also : బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్‌ పంచులు

“ఆర్ఆర్ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్‌తో మొదటి సారి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం 1920కి ముందు స్వాతంత్య్రం సమయంలో తెరకెక్కుతున్న కల్పిత కథ అని రాజమౌళి ముందే చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న రియల్ హీరోలు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ల కథగా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోంది. ఇక “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ డిసెంబర్ 9 న విడుదల అవుతుంది. 2022 జనవరి 7న భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version