బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్‌ పంచులు

నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు “అఖండ” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం ‘అఖండ’ జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి ‘అఖండ’ టీం అంతా అన్ స్టాపబుల్ ఫన్ చేశారు. ముఖ్యంగా తమన్ బాలయ్యపై వచ్చిన మీమ్స్ తో ఈ ఇంటర్వ్యూను మరింత స్పెషల్ చేశారు. ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ నందమూరి హీరోపై తాజాగా వచ్చిన అనేక మీమ్స్, వన్ లైనర్లను పంచుకోవడం ద్వారా నందమూరి బాలకృష్ణ అభిమానులు ‘అఖండ’ విజయాన్ని ఎలా ఆనందిస్తున్నారో వెల్లడించారు. బాలయ్యను ఆకాశానికి ఎత్తేసే క్రేజీ వన్‌లైనర్‌లలో కొన్నింటిని స్వయంగా తమన్ తన ఫోన్‌లో చూసి చదవడం విశేషం.

Read Also : సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్… ఇంత స్లిమ్ గా ఎలా ?

తమన్ చదివిన హిలేరియస్ మీమ్స్ :
బెండకాయ దొండకాయ – బాలయ్య బాబు గుండెకాయ
అన్నంలో పెరుగులేదు – బాలయ్య బాబుకి తిరుగులేదు
కిందా మీదా ఊపు… మా బాలయ్య బాబు తోపు
వానొస్తే కరెంట్ కోతా.. అందరి గుండెల్లో బాలయ్య బాబు మోత
మినపట్టు, పెసరట్టు – బాలయ్య బాబు తొడ కొట్టు
రాముడు, భీముడు – మా బాలయ్య దేవుడు
పసిఫిక్ ఓసెన్ చాల దీపు- మా బాలయ్య తోపు
హౌస్ లోన్ – కార్ లోన్ – బాలయ్య బాబు సైక్లోన్

ఈ లైనర్స్‌పై బాలయ్య స్పందిస్తూ “నన్ను ఇలా ఆరాధించే కొందరు అభిమానులు మంచి జీవితాన్ని గడపడం లేదు. జీవించడానికే కష్టపడతారు. అయినప్పటికీ వారు నా పట్ల ఇంతటి అభిమానాన్ని చూపించడం పట్ల నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది నాకు దేవుడిచ్చిన వరం అని చెప్పాలి” అని అన్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద “అఖండ” తన గర్జనను కొనసాగిస్తోంది.

Related Articles

Latest Articles