NTV Telugu Site icon

Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?

Boys Hostel Trailer

Boys Hostel Trailer

Boys Hostel Theatrical Trailer : అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ ని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమా కోసం తరుణ్ కుమార్ దాస్యం, రష్మీ గౌతమ్ అతిథి పాత్రల్లో నటించారు. అదే విధంగా రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్, అరవింద్ కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించగా పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు.

Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ

ఈ సినిమా గత నెలలో కన్నడలో విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 20+ కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను బేబీ సినిమా టీమ్ చేత రిలీజ్ చేయించారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. ఒక బాయ్స్ హాస్టల్ లో వార్డెన్ అనూహ్యంగా మరణిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కినట్టు అర్ధం అవుతోంది. ఇక ఈ క్రమంలో రష్మీ లాంటి అందం పక్కన ఉన్నా ఈ ట్రైలర్ లో ఏకంగా కుర్రాళ్ళు రక్తం తాగుతున్న అంశం హైలైట్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ మీరూ చూసేయండి.

Show comments