మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది. ఇక సినిమాల్లో పాత్రలు కూడా ఆమెకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకుంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే పై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్లో ఈ మేరకు బాయ్ కాట్ రాధిక ఆప్టే అనే హ్యష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. “బాయ్‌కాట్ రాధికా ఆప్టే” శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈమె నటించిన చిత్రాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. అయినప్పటికీ ఆమె ట్రెండింగ్ లో ఉండడానికి కారణం లీకైన పిక్స్. గతంలో రాధికా నటించిన “పార్చ్డ్” చిత్రం నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి.
Read Also : “ఎన్టీఆర్30” కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ?
అజయ్ దేవగన్ “పార్చ్డ్” చిత్రం నుండి లీకైన పిక్స్ లో అదిల్ హుస్సేన్, తన్నిష్ఠ ఛటర్జీలతో రాధిక రొమాంటిక్ గా కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి రాధికా పైనే కాకుండా బాలీవుడ్ పై కూడా మండిపడుతున్నారు. వీళ్లంతా ఇండియన్ కల్చర్ ను నాశనం చేస్తున్నారట. బాలీవుడ్ లో చాలా చెడ్డ సినిమాలను రూపొందిస్తున్నారని, అశ్లీలతను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారని, వారు మన సంస్కృతికి వ్యతిరేకం అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖుల ప్రవర్తనను నెటిజన్లు తప్పుబడుతున్నారు. పరిశ్రమలోని ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు గట్టిగా మాట్లాడలేరని, ఇతర సమస్యపై తమ స్వరాన్ని వినిపిస్తున్నారని అంటున్నారు. 24 వేల మందికి పైగా ట్విట్టర్ వినియోగదారులు “బాయ్‌కాట్ రాధికా ఆప్టే” హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసారు. మొత్తానికి రాజ్ కుంద్రా అశ్లీల కేసు తరువాత రాధికా కూడా అశ్లీలత కారణంగానే వార్తల్లో నిలిచింది.