Kantara 1 : రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార1 సినిమాపై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ తెలుగు యువత తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం మరింత నిరుత్సాహపరుస్తోంది. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అసలు తెలుగే తెలియదన్నట్టు హైదరాబాద్ లో కన్నడ మాట్లాడాడు. కానీ ఓజీ సినిమా విషయంలో, హరిహర వీరమల్లు విషయంలో బెంగుళూరులో ఎలాంటి గొడవలు చేశారో మనం చూశాం.
Read Also : Janhvi Kapoor : పిచ్చెక్కిపోయే అందాలతో జాన్వీ కపూర్ అరాచకం
తెలుగు పాటలు, తెలుగులో ఫ్లెక్సీలు ఉంటేనే చించేశారు. మరి అలాంటిది హైదరాబాద్ లో కన్నడలో మాట్లాడితే ఎవరూ పట్టించుకోరా అంటున్నారు తెలుగు యూత్. కానీ మరీ దారుణం ఏంటంటే.. ఏపీ ప్రభుత్వం కాంతార1 సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు తెలుగు యూత్ కు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్ల పెంపు ఏంటని మండిపడుతున్నారు. అదే తెలుగు సినిమాలకు కన్నడలో గానీ ఇతర రాష్ట్రాల్లో గానీ ఇలా హైక్స్ ఇస్తున్నారా.. మరి ఇక్కడ వాళ్ల సినిమాలకు ఎందుకు అంటున్నారు. తెలుగు ప్రేక్షకులు అంటే మరీ అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. ఓ వైపు బాయ్ కాట్ అంటుంటే.. కనీసం పట్టించుకోరా అని ఫైర్ అవుతున్నారు.
Read Also : Srinidhi Shetty : సాయిపల్లవిపై శ్రీనిధి శెట్టి ఊహించని కామెంట్స్