NTV Telugu Site icon

Suriya: బోయమామతో సినిమా అంటే రక్త చరిత్ర 3 రాయిస్తాడేమో?

Suriya

Suriya

Boyapati Srinu to direct Tamil hero Suriya: టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2005లో రవితేజ భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఆ తరువాత వరుస సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఒకటి రెండు తప్ప మిగతావన్నీ విజయాన్ని అందుకున్నాయి. బోయపాటి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన అన్ని సూపర్ హిట్ లు చేస్తాడనే పేరుంది. భద్ర తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయజనకి నాయక, వినయ విధేయ రామ, అఖండ లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో స్కంద సినిమా చేస్తున్నారు.

Naveen Polishetty: జవాన్ తో రిలీజ్ అంటే నిద్రకూడా పట్టలేదు.. కానీ అద్భుతం జరిగింది: పోలిశెట్టి

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ నెల 28న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బోయపాటి ఇప్పుడు ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు సూర్య. బోయపాటి సూర్యతో ఔట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒకటి చేయనున్నాడని అంటున్నారు. తాజాగా బోయపాటి చెప్పిన స్క్రిప్ట్‌కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కంగువ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సూర్య ఇప్పటికే సుధా కొంగర, లోకేష్ కనగరాజ్, వెట్రిమాన్‌లతో సినిమాలకు కూడా సైన్ చేశాడు. ముందుగా బోయపాటి శ్రీను సినిమాని పూర్తి చేసి ఆ తర్వాత ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య తర్వాత బోయపాటి అఖండ 2 & అల్లు అర్జున్ లతో సినిమాలు చేయనున్నారు.

Show comments