Akhanda 2 Update: రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ పక్కనే ఉండగా బోయపాటి శ్రీను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నందమూరి అభిమానులు అందరూ అఖండ అఖండ అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలో అఖండ సీక్వెల్ సినిమా గురించి బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
Ram Pothineni: మూడు జనరేషన్లను మాయ చేసిన హీరో బాలయ్యే..
చేస్తాను అఖండ 2 చేస్తున్నాను, నేను చెబుతాను, నేను చెబుతా చిన్న టైం అటు ఇటు అంతే అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో స్కంద తరువాతి సినిమా అఖండ 2 అయి ఉండవచ్చు అని సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే బాబు డైరెక్షన్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. బహుశా ఆ సినిమా పూర్తయిన వెంటనే అఖండ 2 పట్టాలెక్కే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ జరుగుతోంది.