Site icon NTV Telugu

Skanda: బోయపాటి- రామ్ పోతినేని ‘స్కంద’ గుమ్మడికాయ కొట్టేశారు

Skanda Movie Shooting Wrapped

Skanda Movie Shooting Wrapped

Boyapati Sreenu Ram Pothineni Skanda Shooting Wrapped Up: మాస్ మూవీ మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని సైతం ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్‌ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటికే రామ్ సరికొత్త మాస్ అవతార్ లో కనిపించారు. ఇక తాజగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. అదేమంటే తాజాగా ఒక భారీ సెట్‌లో ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు రామ్-శ్రీలీల, డ్యాన్సర్‌లపై చివరి పాటను షూట్ చేశారు. ఇక ఈ చివరి పాటతో స్కంద షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఇక ఈ మేరకు ఒక ఫొటోని మేకర్స్ రిలీజ్ చేయగా అందులో రామ్, శ్రీ లీల సహా దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి సాంగ్ కోసం డిజైన్ చేసిన ఫ్యాన్సీ డ్రెస్సులతో కనిపించారు. ఇక మేకర్స్‌ పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయనుండగా సినిమా ప్రమోషన్‌ కు కూడా తగిన సమయం దొరికిందని ఫీల్ అవుతున్నారు.

Vijay Deverakonda: ఇక ఇప్పుడు ఆ ఒక్కటీ నా వల్ల కాదు అంటున్న విజయ్ దేవరకొండ

ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా దీన్ని జోరుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు మేకర్స్. టీజర్, టైటిల్ గ్లింప్స్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించగా, ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు ఇప్పటికే రిలీజ్ అయి ఒక చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాట అన్ని మ్యూజిక్ యాప్స్ లో అగ్రస్థానంలో ఉంది. ఈ పాటలో రామ్, శ్రీలీల ఎనర్జిటిక్ ఎలిగెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యపరచగా సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఇక సినిమాను జీ స్టూడియోస్ సౌత్, అలాగే పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుండగా ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టే యోచనలో ఉన్నారు మేకర్స్.

Exit mobile version