NTV Telugu Site icon

North Vs South: బాలీవుడ్ సౌత్ సినిమాలని టార్గెట్ చేస్తుందా? కావాలనే క్లాష్ కి వస్తున్నారా?

North Vs South

North Vs South

గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా అనగానే హిందీ చిత్ర పరిశ్రమ గుర్తొస్తుంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా అనిపించే స్థాయిలో సౌత్ సినిమాల డామినేషన్ ఉంది. ముఖ్యంగా రాజమౌళి తన సినిమాలతో ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని ఆస్కార్ వేదిక వరకూ తెలిసేలా చేసాడు. నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీపై గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ సినిమా దాడి జరుగుతూనే ఉంది. సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నార్త్ లో స్టార్ హీరోలు ఫ్లాప్స్ బాట పట్టడంతో సౌత్ సినిమాలపైనే బాలీవుడ్ ట్రేడ్ కూడా నడించింది. స్పెషల్లీ పోస్ట్ కరోనా సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కోలుకోలేక పోయింది. సీజన్ తో సంబంధం లేకుండా సౌత్ సినిమాలు నార్త్ లో హిట్స్ అవుతున్న సమయంలో… 2023 బాలీవుడ్ కి ప్రాణం పోసింది.

షారుఖ్ ఖాన్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో కంబ్యాక్ ఇవ్వడం, గదర్ 2 సెన్సేషనల్ హిట్ అవ్వడం, చిన్న సినిమాలు కూడా వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో హిందీ చిత్ర పరిశ్రమ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇబ్బందుల నుంచి కోలుకున్న బాలీవుడ్, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, అందుకే సౌత్ సినిమాలపై కావాలనే పోటీగా తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జైలర్ కి అపోజిట్ లో గదర్ 2, లియో-టైగర్ నాగేశ్వర రావు సినిమాలకి పోటీగా గణపత్, సలార్ vs డుంకి, పుష్ప 2 vs సింగం అగైన్… ఇవ్వన్నీ హ్యూజ్ బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్న క్లాష్ లు. ఈ సినిమాలని నార్త్ ఫిల్మ్ మేకర్స్ మన మూవీస్ పైన పోటీ కోసమే వదులుతున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో నిజం ఉన్నట్లు కనిపించట్లేదు ఎందుకంటే సింగం అగైన్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. సింగం అగైన్ డేట్ వచ్చిన తర్వాతే పుష్ప 2 డేట్ వచ్చింది. డుంకి రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది, ఆ తర్వాత ఇప్పుడు సలార్ వచ్చి డిసెంబర్ రేస్ లో నిల్చుంది. ఒక్క గణపత్ విషయంలోనే పోటీ అనేది నార్త్ నుంచి వచ్చింది. మిగిలిన అన్ని సార్లు… ఆల్రెడీ నార్త్ వాళ్లు ఫిక్స్ చేసుకున్న డేట్ కి మన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో క్లాష్ బాలీవుడ్ నుంచి కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉన్నట్లు ఉంది. మరి ఈ అక్టోబర్ 19 నుంచి వచ్చే ఆగస్టు 15 వరకూ జరగనున్న క్లాష్ లో బాలీవుడ్ గెలుస్తుందా లేక సౌత్ సినిమా గెలుస్తుందా అనేది చూడాలి.