Site icon NTV Telugu

Mahesh Comments: చేతులెత్తేసిన నిర్మాత.. కౌంటరిచ్చిన వర్మ

Boney Kapoor Rgv On Mahesh Comments

Boney Kapoor Rgv On Mahesh Comments

బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడికెళ్ళి తన సమయాన్ని వృధా చేసుకోలేనని మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. బాలీవుడ్ నుంచి తారాస్థాయి వ్యతిరేకత ఎదురవుతోంది. మహేశ్‌ని చాలా బ్యాడ్‌గా ట్రోల్ చేస్తున్నారు. తాను బాలీవుడ్‌ని కించపరచలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మహేశ్‌పై విమర్శలు ఆగడం లేదు.

అయితే.. నిర్మాత బోనీ కపూర్ మాత్రం తాను మహేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చేతులెత్తేశాడు. ఆ కామెంట్స్‌పై రియాక్ట్ అవ్వడానికి తాను కరెక్ట్ పర్సన్ కాదని, ఎందుకంటే తాను సౌత్‌లోనూ సినిమాల్ని నిర్మిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉన్నానని, ఇకపై కన్నడ, మలయాళంలో కూడా చిత్రాల్ని నిర్మిస్తానని చెప్పారు. తాను కేవలం బాలీవుడ్‌కి చెందినవాడ్ని కానని, సౌత్ వాడిని కూడా అని, అందుకే ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని బోనీ కపూర్ స్పష్టం చేశారు. అయినా.. మహేశ్‌కి ఏది అనిపిస్తే, అది మాట్లాడే పూర్తి హక్కు అతనికుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక రామ్ గోపాల్ వర్మ కూడా మహేశ్ బాబు చెప్పినదాంట్లో తప్పేమీ లేదని అతడ్ని సమర్థించాడు. ఎందుకంటే.. ఏ కథని ఎంపిక చేసుకోవాలి? ఎలాంటి సినిమాలు చేయాలి? ఏ భాషలో చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు హీరోలకి ఉందన్నాడు. కాకపోతే.. బాలీవుడ్ తనని భరించలేదని మహేశ్ ఎందుకన్నాడో తనకి అర్థం కావడం లేదని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

Exit mobile version