Site icon NTV Telugu

Rakhi Sawant: మూడో పెళ్ళికి సిద్ధం అయిన బాలీవుడ్ హీరోయిన్..

Rakhi

Rakhi

బాలీవుడ్‌ హాట్ బ్యూటిగా పేరుగాంచిన రాఖీ సావంత్ గురించి పరిచయం అక్కనర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముందుగానే ఒకరితో విడాకులు తీసుకున్న రాఖి.. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్‌ ఖాన్‌ దురానీ ని రహస్యంగా మరో వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో కూడా విడిపోయింది. ఇక తాజాగా రాఖీ సావంత్‌ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Also Read:Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్

తాజాగా సోషల్ మీడియాలో డోడి ఖాన్ కు సంబంధించిన వీడియోలు కొన్ని షేర్ చేస్తూ.. ‘డోడి ఖాన్‌తో పాకిస్థాన్‌లో ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొబోతున్నాను. రిసెప్షన్‌ మాత్రం భారత్‌లో ఉంటుంది. పెళ్లి తర్వాత హనీమూన్‌ కోసం స్విట్జర్లాండ్‌ లేదా నెదర్లాండ్స్‌కు వెళ్లదాం అనుకుంటున్నాం. చివరిగా పెళ్లి తర్వాత దుబాయ్‌లోనే స్థిరపడతాను ’అంటూ రాఖీ సావంత్‌ వెల్లడించింది. ఇక రాఖీ ప్రకటన, డోడి ఖాన్‌ వీడియో షేర్‌ చూసిన నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కోల కామోంట్ లు చేస్తున్నారు. ‘రాఖీ జీ మన బరాత్‌ భారత్‌లోనా దుబాయ్‌లోనా’ అంటూ ప్రశ్నించాడు. మరి కొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తేలినప్పటికీ . ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Exit mobile version