NTV Telugu Site icon

HIT Movie: జూలైలో రాబోతున్న బాలీవుడ్ ‘హిట్’ మూవీ

Hit Movie

Hit Movie

తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. విశ్వక్ సేన్ పాత్రలో రాజ్‌కుమార్ రావు, రుహాని శర్మ పాత్రలో సన్యా మల్హోత్రా కనిపించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, కుల్‌దీప్ రాథోడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ‘హిట్’ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూలై 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తప్పిపోయిన అమ్మాయిని వెతికే పోలీస్ కథ నేపథ్యంలో హిట్ సినిమా ఉంటుంది. మర్డర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెలుగులో విశ్వక్ సేన్ మంచి నటన కనపరిచాడు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. కాగా త్వరలో తెలుగులో హిట్-2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీక్వెల్‌లో విశ్వక్ సేన్ పాత్రలో అడివి శేష్ కనిపించనున్నాడు.

Show comments