బీటౌన్‌లో గత ఏడాదంతా హారర్ కామెడీలదే హవా. కానీ ఈ ఏడాది యాక్షన్ ఎంటర్టైనర్లకు పట్టం కడతారు అనుకుంటే.. డిఫరెంట్‌గా.. హిస్టారికల్ అండ్ లవ్ స్టోరీలకు ఊహించని సక్సెస్ ఇచ్చారు. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలపై మక్కువ పెంచుకున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ సనమ్ తేరీ కసమ్, సైయారా. అక్కడ ఆడియన్స్ లవ్ స్టోరీలు చూడక కరువులో ఉన్నారేమో.. ప్లాప్ సినిమా సనమ్ తేరీ కసమ్‌ను రీ రిలీజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ చేసేశారు.
Also Read : Dil Raju : పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నా ఏడాదికి ఒక సినిమా చేయాలి
వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి7న రిలీజైంది సనమ్ తేరీ కసమ్. హర్షవర్థన్ రాణే- మావ్రా జంటగా నటించిన ఈ సినిమా సుమారు 50 కోట్లను వసూలు చేసి.. ఇండియన్ సినీ చరిత్రలోనే రీ రిలీజెస్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా మారింది. రీ రిలీజ్‌లో ఈ సినిమా ఇచ్చిన బూస్టర్‌తో మరో రొమాంటిక్ డ్రామా ఏక్ దీవాని కీ దివానియా ప్రిపేర్ చేస్తున్నాడు రాణే. అక్టోబర్ 21న థియేటర్లలోకి రాబోతుంది ఈ న్యూ లవ్ స్టోరీ.
జీరో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన సైయారా గురించి చెప్పనక్కర్లేదు. హిస్టారికల్ మూవీ చావా తర్వాత సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓ చిన్న ఫిల్మ్ నిలబడం ఆషామాషీ కాదు. అందులోనూ కొత్త వాళ్లు అహన్ పాండే- అనీత్ పద్దాతో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారాను థియేటర్లలో ఆడియన్స్ చూసి పడి పడి ఏడ్చారు. ఇంటెన్సివ్ స్టోరీని చూసి మనసులో ఎక్కడో దాగిన ఆర్ద్రతను బయటకు తీసినట్లే ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. అన్నీ లవ్ స్టోరీలకు పట్టం కట్టారా అంటే కామన్ అనిపించేవి కాకుండా.. ఇంటెన్స్, బ్రేకప్ లాంటి ఇన్ డెప్త్ లవ్ డ్రామాలనే హిట్ చేశారు. నెక్ట్స్ అలాంటి కాన్సెప్ట్ ప్రేమ కథా చిత్రాలు రాబోతున్నాయి. వాటిల్లో ఒకటి తేరే ఇష్క్ మే. ఆనంద్ ఎల్ రాయ్- ధనుష్ కాంబోలో పుష్కర కాలం తర్వాత తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ డ్రామా టీజర్ చూస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. కోపం, ప్రేమలాంటి భావోద్వేగాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫిల్మ్ నవంబర్ 28న థియేటర్లలోకి రాబోతుంది. ఇదే కాదు డిసెంబర్ ఎండ్‌లో సాయి పల్లవి- జునైద్ ఖాన్ లవ్ స్టోరీ మేరీ రహో కూడా పలకరించబోతుంది. ఇన్ని లవ్ స్టోరీల్లో బీటౌన్ ఆడియన్స్ మనసు గెలిచే ఫిల్మ్ ఏదో.
