NTV Telugu Site icon

మరోసారి స్కూల్ కెళ్ళినట్టుందన్న అక్షయ్ కుమార్!

akshay kumar

akshay kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని, ఇక ప్రేక్షకుల ప్రేమ అందుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అప్పటి రామసేతును వానరుల సాయంతో కట్టారని, ఇప్పటి తమ ‘రామసేతు’ నిర్మాణానికి తమ బృందం ఎంతో కృషి చేసిందని చెబుతూ, అక్షయ్ కుమార్ చిన్నపాటి వీడియోలో మూవీ టీమ్ ను చూపించాడు. జాక్విలిన్ ఫెర్నాండేజ్, నుస్రత్‌ బరూచ, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను అభిషేక్ శర్మ డైరెక్ట్ చేశాడు. దీపావళి కానుకగా ‘రామ్ సేతు’ జనం ముందుకు రాబోతోంది.