కోవిడ్ -19, న్యుమోనియా, ఇతర వ్యాధులతో దాదాపు నెల రోజుల పోరాటం తర్వాత లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. దక్షిణ ముంబైలోని ఆమె నివాసం ప్రభు కుంజ్ కు ఇప్పటికే లతా మంగేష్కర్ భౌతికకాయం చేరుకుంది. ప్రస్తుతం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ప్రభు కుంజ్ ఇంట్లో ఉంచారు. పలువురు పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు ఆమెకు చివరిసారి నివాళులర్పించారు.
Read Also : లతాజీ అంత్యక్రియలకు ప్రధాని… రంగంలోకి దిగిన సీఎం
ముంబైలోని లతా మంగేష్కర్ ఇంటి ‘ప్రభు కుంజ్’ చివరి చూపు కోసం జనం పోటెత్తారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, జావేద్ అక్తర్, రాజ్ థాకరే, పంకజ్ ఉధాస్, సంజయ్ లీలా బన్సాలీ, శ్రద్ధా కపూర్, సంజయ్ లీలా బన్సాలీ వంటి చాలామంది సినీ ప్రముఖులు లతా మంగేష్కర్ ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ లతజికి కడసారి నివాళి అర్పించేందుకు ముంబైకి బయలుదేరారు. మరోవైపు శివాజీ పార్క్‌లో ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్‌లో సాయంత్రం 6:30 గంటలకు లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

