Site icon NTV Telugu

Hari Hara Veeramallu: రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్.. కానీ?

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

A Bollywood Star To Play Pivotal Role In Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. నిజానికి.. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ.. పవన్ ఇతర ప్రాజెక్టులతో రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు పవన్ సమయం కేటాయించడంతో.. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా పనుల్ని చకచకా కానిచ్చేస్తున్నాడు. అలాగే.. సినిమాలోని కీలక పాత్రల కోసం పేరుగాంచిన నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు. తాజాగా ఓ రాజు పాత్ర కోసం బాలీవుడ్ నుంచి ఒక స్టార్ నటుడ్ని ఎంపిక చేశాడని సమాచారం. ఇంతకీ ఆ నటుడు ఎవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. బాబీ డియోల్.

సినిమాల పరంగా బాబీ డియోల్ కెరీర్ డౌన్‌ఫాల్ అయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం ఆయన దుమ్ముదులుపుతున్నాడు. ఆశ్రమ్ వెబ్ సిరీస్ అయితే ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. దాంతో పాటు విభిన్నమైన పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు. అందుకే, డైరెక్టర్ క్రిష్ ఏరికోరి మరీ బాబీ డియోల్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడో చిన్న కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకుముందే ఓ కీ-రోల్ కోసం అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. మరి, అతని స్థానంలో బాబీ డియోల్‌ని తీసుకున్నారా? లేకపోతే ఇద్దరూ ఉంటున్నారా? అనేదే అయోమయంగా మారింది. ఎందుకంటే.. డేట్స్ కుదరకపోవడంతో అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో బాబీ డియోల్‌ని దింపారని ఇండస్ట్రీలో ఓ ప్రచారం జరుగుతోంది. మరి, ఇది నిజమో కాదో తేలాలంటే, అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే!

Exit mobile version