యంగ్ అందు టాలెంటెడ్ బ్యూటీ నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్లడీ మేరీ. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆహా లో వెబ్ ఒరిజినల్ గా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా బ్లడీ మేరీ ట్రైలర్ ను ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్, నిఖిల్ సిద్ధార్థ విడుదల చేశారు, ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ట్రైలర్ ను బట్టి మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ” ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని ఒక మనిషి ఉంటారు. అవసరం, అవకాశాన్ని బట్టి ఆ మనిషి బయటికి వస్తాడు.. మ్యాటర్ ఏంటి అంటే ఆ బయటికి వచ్చిన మనిషే ఒరిజినల్ అంటూ అజయ్ బేస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది.
ఇక కథను విషయానికొస్తే హాస్పిటల్ లో ఒక గ్యాంగ్ చిన్న పిల్లలను ఎత్తుకెళ్తారు. అక్కడ నివేతా ఆ ఘటనను చూసి వారిని రక్షించడానికి, ఆ క్రైమ్ ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.. మధ్యలో పోలీస్ ఆఫీసర్ అజయ్ హంతకులను హత్య చేస్తుంది ఎవరు అనేది కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. చివరకు మేరీ తన ప్రియమైన వారిని రక్షించుకుందా..? అజయ్ నివేతా నిజ స్వరూపాన్ని బయటపెట్టడా..? నివేతా పక్కన ఉన్న ఆ ఇద్దరు ఎవరు..? అనేది ట్విస్ట్ గా చూపించారు. ఇక చివర్లో కాలానికి విపరీతమైన మెమరీ పవర్.. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు… కర్మ రూపం లో తిరిగి ఇచ్చేస్తుంది అని నివేతా చెప్పడం తో ఆమె తనకు జరిగిన అన్యాయాన్నీ ఎదిరించి న్యాయం దక్కించుకుందని తెలుస్తోంది. మరి అది ఎలా అనేది బ్లడీ మేరీ చేసు తెలుసుకోవాల్సిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి బ్లడీ మేరీ తో నివేతా హిట్ ని అందుకుంటుందా..? లేదా అనేది చూడాలి.
