NTV Telugu Site icon

Ilayaraja : రాజ్యసభకు మ్యూజిక్ మాస్ట్రో ?

Ilayaraja

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ సీటు అనే విషయంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది. మరోవైపు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం సుబ్రమణ్య స్వామిని మోడీ ప్రభుత్వం రాజ్యసభకు పంపింది. ఇప్పుడు అలాగే ఇళయరాజాను కూడా నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read Also : Ante Sundaraniki : టీజర్ కు టైమ్ ఫిక్స్… మీట్ నాటి సుందర్, మైటీ లీలా

నిజానికి ఇలా వార్తలు రావడానికి ఓ ప్రత్యేక కారణమే ఉంది. ఇళయరాజా ఇటీవల ‘అంబేడ్కర్‌-మోదీ రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే బుక్ కు ముందు మాట రాశారు. అందులో అంబేడ్కర్ ఆశయాలను ప్రధాని మోడీ నెరవేరుస్తున్నారని ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజా వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా పంపే విషయమై అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఇటు రాష్ట్రపతి కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఈ విషయంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.