Bittiri Satti: స్టార్ హీరోల రేంజ్ లో బిత్తిరి సత్తి రేంజ్ రోవర్.. ఎన్ని కోట్లో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bittiri Satti: బిత్తిరి సత్తి.. ఈ పేరు వినని వారుండరు. ప్రస్తుతం ఏ సినిమా ప్రమోషన్స్ జరిగినా బిత్తిరి సుత్తితో ఇంటర్వ్యూ జరగాల్సిందే. ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా మొదలుపెట్టిన రవి కుమార్.. బిత్తిరి సత్తిగా మారిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సత్తి తాజాగా కాస్ట్లీ కారును కొనుగోలు చేశాడు. అది కూడా అల్లాటప్పా కారు కాదు.. స్టార్ రేంజ్ ఉండే రేంజ్ రోవర్. ఈ కారు ధర రూ. 2.50 నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని టాక్ నడుస్తోంది. బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ తో బిత్తిరి సత్తి దిగిన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కారును చూసినవారందరు రేంజ్ రోవర్ కొనే స్థాయికి బిత్తిరి సత్తి ఎదిగాడంటే రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది.
ఒక న్యూ స్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన చేవెళ్ల రవి.. తనదైన స్లాంగ్, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తీన్మార్ వార్తలు అనే షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రవి.. బిత్తిరి సత్తిగా మారిపోయాడు. ఇక ఈ షో తో అతడు వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బిత్తిరి సత్తి యాంకర్ గానే కాదు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ రేంజ్ లో సంపాదిస్తే రేంజ్ రోవర్ ఏంటి.. ఏదైనా కొనొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!