బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది.
తాజాగా బిందుకు సంబంధించిన ఒక పోస్ట్ ని ని బిగ్ బాస్ ఓటిటీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఫేస్ కనిపించని ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి అంటూ క్విజ్ పెట్టేశారు. ఇక అందులో బిందు మాధవి స్పష్టంగా కనిపించేస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగులో అవకాశాలు లేక తమిళ్ సైడ్ వెళ్ళిపోయిన బిందు మాధవి బిగ్ బాస్ ద్వారా అభిమానులను పొందాలనుకుంటుంది. ఈ షోలో అదరగొడితే ఆ తర్వాత ఆమె అదృష్టం మలుపు తిరిగినట్టే.. ఈ బిగ్ బాస్- ఓటిటీ స్టంట్ తర్వాత తెలుగులో ఈ అమ్మడికి ఎలాంటి ఆఫర్లు రానున్నాయి? అనేది చూడాలి.
