Bimbisara రాకకు ముహూర్తం ఖరారయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం “బింబిసార”. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో బ్లాక్ సూట్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్.
Read Also : Chiranjeevi : సుకుమార్ యాడ్ లో కుమ్మేసిన బాస్… భార్యతో చీటింగ్ అనుకునేలోపే ఇలా…!
ఇక ఇప్పటికే విడుదల చేసిన “బింబిసార” టైటిల్, గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచేసిన విషయం తెలిసిందే. రక్తపు మరకలు ఉన్న కత్తిని పట్టుకుని, మృతదేహాల సమూహంపై కూర్చున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ క్యూరియాసిటీని రేకెత్తించింది. ఈ టైమ్-ట్రావెల్ మూవీలో కళ్యాణ్ రామ్ ఓ పవర్ ఫుల్ రాజుగా, నేటితరం స్టైలిష్ నేటి యువకుడిగా రెండు ఆసక్తికర పాత్రల్లో నటిస్తున్నాడు. ఇందులో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా, ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ఈ చిత్రానికి కెమెరా వర్క్ ఛోటా కె నాయుడు, కొరియోగ్రఫీ శోబి, రఘు, ఫైట్స్ వెంకట్, రామకృష్ణ అందించారు. కళ్యాణ్ రామ్ ను వెండితెరపై చూసి చాలా రోజులు కావడంతో నందమూరి అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
