NTV Telugu Site icon

HIT 2: మేకర్స్ చేసిన అతిపెద్ద తప్పు అదే…

Hit 2 Trailer Update

Hit 2 Trailer Update

‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా ఇప్పటికే ‘హిట్ ఫస్ట్ కేస్’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ గా ‘హిట్ సెకండ్ కేస్’ రూపొందింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొడుతున్న అడవి శేష్ నటించిన ఈ ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాని హీరో నాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. రిలీజ్ డేట్ దెగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ‘హిట్ 1’ హిట్ అవ్వడం, థ్రిల్లర్ జానర్ లో అడవి శేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘హిట్ 2’ సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఈ అంచనాలు చాలు, ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి. ఇది చాలదు అనుకున్నారో ఏమో కానీ చిత్ర యూనిట్, తమ సినిమాపై అంచనాలని మరింత పెంచడానికి ఒక చిన్న తప్పు చేసింది. అదే ఈరోజు ‘హిట్ 2’ని ఇరకాటంలో పడేసింది.

‘హిట్ 1’ ఎండ్ క్రెడిట్స్ లో ‘హిట్ 2’ ఉంటుందని చూపించడంతో, ఆ విషయం తెలియకుండా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ‘హిట్ 2’ విషయంలో ఇలా చేయకుండా, ప్రమోషన్స్ సమయంలోనే ‘హిట్ 3’ సినిమాలో హీరో ఎవరో ‘హిట్ 2’ క్లైమాక్స్ లోనే చూపిస్తాం. ఆ హీరో తెరపై కనిపిస్తారు అంటూ చిత్ర యూనిట్ ప్రమోట్ చేయడంతో… ‘హిట్ 3’ గురించి చర్చలు బాగానే జరిగాయి. దీంతో తమ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని చిత్ర యూనిట్ భావించింది కానీ ఇదే తమ సినిమాకి నష్టం తెస్తుందని ఊహించలేక పోయింది.

శైలేష్ కొలను, ‘హిట్ ఫ్రాంచైజ్’ రెడీ చేస్తున్నాడు అని తెలిసిన ఆడియన్స్ కి ‘హిట్ 2’ తర్వాత ‘హిట్ 3’ వస్తుందనే విషయం గ్యారెంటీగా ఊహించగలడు. ఆ గెస్సింగ్ తోనే ‘హిట్ 1’ ఎండ్ లో ‘హిట్ 2’ ఉంటుందని చూపించినట్లు ‘హిట్ 3’లో క్లైమాక్స్ లో ‘హిట్ 3’కి లీడ్ ఇస్తారని ఊహిస్తూ థియేటర్ కి వచ్చి కూర్చునే వాడు. అప్పుడు స్క్రీన్ పైన చూసే ఆడియన్స్ కి ‘హిట్ 3’ హీరోని కూడా రివీల్ చేసి ఉంటే సినిమాకి ‘బాంగ్ ఆన్’ ఎండ్ దొరికేది. ఇది చూసిన ఆడియన్స్, అసలు ఊహించనిది జరిగింది కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్ లో థియేటర్ నుంచి బయటకి వచ్చే వాడు. ఈ విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయిన చిత్ర యూనిట్, ‘హిట్ 2’ రిలీజ్ కి ముందే ‘హిట్ 3’లో కనిపించబోయే హీరో ఎవరో ‘హిట్ 2’లోనే చూపించబోతున్నాం అని చెప్పడంతో, థియేటర్స్ లోకి వెళ్లిన ఆడియన్స్… ఆ ‘హిట్ 3’ హీరో ఇతనే అంటూ వీడియోలు రిలీజ్ చేసి, నాని అండ్ టీంకి పెద్ద షాక్ ఇచ్చాడు. ప్రమోషన్స్ లో ‘హిట్ 3’ హీరో కనిపిస్తాడు అని చెప్పకపోయి ఉంటే సర్ప్రైజ్ వర్కౌట్ అయ్యేది, అలా చెప్పడం వలన ఒక హై ఇచ్చే ఎండింగ్ ని మేకర్స్ మిస్ చేసుకున్నారు.