Bigg Boss Uma Devi Daughter Sensational Comments: నటిగా తెలుగు వారందరికీ సుపరిచితురాలు అయిన ఉమా. బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఆమె సందడి చేసింది. చివరి వరకు లేకపోయినా వివాదాస్పద కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఆమె పెద్ద కుమార్తె తనుషా సోషల్ మీడియా వేదికగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత నీతోనే డాన్స్ 2.0 కంటెస్టెంట్లైన నేహా చౌదరి, విశ్వా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో నేహా, విశ్వ డాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేసి నాకు ఒకటి అర్థం కాదు, ఈ షోలో డాన్స్ ఉండాలి కానీ ఈ జంట ప్రతిసారి జిమ్నాస్టిక్స్ చేస్తారు. ఎవరికైనా టాలెంట్ ఉందంటే యూస్ చేసుకోవచ్చు కానీ ప్రతిసారి ప్రతి డాన్సులో జిమ్నాస్టిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈ జడ్జిలు కూడా అసలు ఇలా జడ్జిమెంట్ ఎలా ఇస్తారో? అర్థం కాదు. పనికిమాలిన జడ్జిమెంట్ అంతే. ఏదో జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఆర్టిస్టులని పోషించాలి అంతేకానీ డాన్స్ అంటే ఏంటి? అసలు జడ్జిమెంట్లు ఎట్లా ఇవ్వాలని కూడా తెలియకుండా ఉంటున్నారు.
Bigg Boss Swetha: అసభ్యంగా బిగ్ బాస్ శ్వేతకు మెసేజులు.. మీ అమ్మని కూడా ఇలాగే అంటూ!
ఈ స్టార్ మా వాళ్లు, నీతోనే డాన్స్ 2.0 వాళ్లు కూడా డాన్స్ రాని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారని తెలిసిందే. లిప్ సింక్ ఉండదు, జంటల మధ్య సింక్ ఉండదు. అంతా గజిబిజి గందరగోళంలా ఉంటుంది. అయినా ఫుల్ కి ఫుల్ మార్క్స్ ఇస్తారు. కేవలం ఈ ఒక్క జంట మాత్రమే కాదు దాదాపు అన్ని జంటలు అలానే ఉన్నాయి. మరి వీళ్ళు ఏం జడ్జిలో నాకు అర్థం కాదు. అయినా హీరోయిన్స్ ని తీసుకొచ్చి జడ్జిల లాగా కూర్చోబెడితే ఏం తెలుస్తది వాళ్ళకి? అంటూ ఆమె డాన్స్ షో మీద తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాసుకొచ్చింది. మరో కన్నడ జోడి అంటూ ఫోటో షేర్ చేసిన ఆమె వాళ్ళకి తెలుగు సాంగ్స్ తెలీదు, లిరిక్స్ రావు అయినా ఫుల్ మార్క్స్ ఇచ్చేయాలి. ఏదైనా కానీ మన తెలుగు వాళ్ళం కన్నడ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అదే మన తెలుగు వాళ్ళు వెళ్లి కన్నడ డాన్స్ షోలో కానీ సీరియల్స్ గాని చేస్తామని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? తెలుగు టీవీ ఫెడరేషన్ వాళ్ళు కొంచెం ఆలోచించండి .ప్లీజ్ తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటూ ఆమె రాసుకొచ్చారు.

