Site icon NTV Telugu

మాట నిలబెట్టుకున్న నాగార్జున

nagarjuna

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే… ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ చివరి ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున తాను రెండు నెలల వ్యవధిలో తిరిగి షోలోకి వస్తానని, అయితే వేరే ఫార్మాట్‌లో ఉంటుందని చెప్పాడు. “సాధారణంగా మరో సీజన్‌ను ప్రారంభించడానికి ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి నేను కొత్త ఫార్మాట్‌లో కేవలం రెండు నెలల్లో తిరిగి వస్తాను” అని నాగ్ సైన్ ఆఫ్ చేస్తున్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న నాగ్ ఈ నెలలో బిగ్ బాస్ వేదికపైకి తిరిగి వస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు OTT తొలి సీజన్ ఫిబ్రవరి 26న ప్రీమియర్‌గా విడుదల కానుంది.

Read Also : దుబాయ్ లో కాజల్… రీజన్ స్పెషలే మరి !

డిస్నీ+ హాట్‌స్టార్ 24*7 షోను ప్రసారం చేస్తుంది. ఈ ఫార్మాట్‌లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ప్రీమియర్ తేదీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గ్రాండ్ లాంచ్ కోసం టీమ్ సన్నద్ధమవుతున్నట్లు వినికిడి. బిగ్ బాస్ OTTలో పాత, కొత్త హౌస్‌మేట్స్ కనిపించనున్నారని అంటున్నారు. ఇది OTT ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే ప్రసారం అవుతుంది. టెలివిజన్‌లో కాదు. ఈ షో దాదాపు 84 రోజుల పాటు కొనసాగుతుందని అంచనా.

Exit mobile version