Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఫైర్ మీద ఉన్న కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి లాంటి వారు బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఫోక్ సింగర్, డ్యాన్సర్ అయిన రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వారం ఓటింగ్ లో రాము చివరలో లేడు.
Read Also : Janhvi Kapoor : ఆ తెలుగు హీరోతోనే డేటింగ్ చేస్తా.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
తాజా ప్రోమోలో ఒక్కొక్కరికి వచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ల గురించి చెప్పాడు నాగ్. వాటిని చూడాలంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వదులుకోవాలంటూ కండీషన్ పెట్టాడు. అలా చివరకు రాము రాథోడ్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యాడు. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. తాను హౌస్ లో ఉండలేనని.. బయటకు వెళ్లిపోతాను అంటూ తెలిపాడు. హీరోలు ఎవరూ మధ్యలో వదిలేయరని నాగార్జున నచ్చజెప్పినా సరే రాము వినిపించుకోలేదు. నాగార్జున పది సెకన్ల టైమ్ ఇచ్చాడు. అయినా సరే వెళ్లిపోతానని చెప్పడంతో నాగ్ ఓకే చేశాడు. రాము అలా బయటకు వచ్చేశాడు. ఎలాంటి వివాదాలకు పోని రాము.. చివరకు ఇలా బయటకు వచ్చేశాడు. మరి నిజంగానే వెళ్లిపోయాడా.. లేదంటే ఇందులో ట్విస్ట్ ఏమైనా ఉందా అనేది చూడాలి.
Read Also : Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?
