Bigg Boss 9 : బిగ్ బాస్ అనేది అతిపెద్ద రియాల్టీ షో. తెలుగు నాట దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద సెలబ్రిటీలు కూడా వెళ్లి అక్కడ అలరిస్తున్నారు. అయితే కొన్ని సీజన్ల నుంచి సామాన్యులకు కూడా ఇక్కడ పెద్ద పీట వేస్తోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. తాజాగా బిగ్ బాస్-9 కోసం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది బిగ్ బాస్ సంస్థ. ఈ సారి ఎవరైనా బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపింది. ఇంతకు ముందు కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరికి అవకాశం ఇచ్చేవారు. ఈ సారి మాత్రం ఆడిషన్స్ చేసి కంటెస్టెంట్లుగా సామాన్యులను సెలెక్ట్ చేస్తామని చెబుతోంది మేనేజ్ మెంట్.
Read Also : Venky Atluri : సూర్య పాత్ర రివీల్ చేసిన వెంకీ అట్లూరి..
ఎవరైనా సరే తమ ఆడిషన్ ను పంపించొచ్చు అని కోరుతోంది. అందుకోసం https://bb9.jiostar.comలో రిజిస్టర్ కావాలి. తర్వాత మీరు బిగ్ బాస్ లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ వీడియో చేసి అందులోనే అప్ లోడ్ చేయాలి. మీ వీడియో మేనేజ్ మెంట్ కు నచ్చితే మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు నాగార్జున. ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : Allu Arjun : బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను వదులుకున్న బన్నీ..!
