Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu 7: బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ అరిచే సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ మొదలుకానుంది. ఎపప్టి నుంచో బిగ్ బాస్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఈసారి కూడా ఈ సీజన్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 7 ప్రోమో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈసారిఅంతకుమించిన ఫన్ ఉంటుందని నాగ్ మొదటి ప్రోమోలోనే చెప్పడంతో ఈ షోపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముందు చెప్పినట్టుగానే ఈసారి అంతకుమించి ఉండబోతుందని నాగ్ ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా చెప్పుకొచ్చాడు.
Sneha: స్నేహ.. దయచేసి అలాంటి పనులు చేయకు.. గుండెపోటు వస్తుంది
Also Read
- Peddi Monday Test : ఈ రోజు నుండి 'పెద్ది'కి అసలైన ఆట మొదలు
- Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!... ఈ వారమే ఓటీటీలోకి సూర్య 'కరుప్పు'
- Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
- MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక... సాయి పల్లవి చేజారినట్టే ?
ఇద్దరు ప్రేమికులు.. ప్రేమించిన అబ్బాయి కొండమీద నుంచి కిందపడిపోతుంటే.. కొండపైన ఉన్న అమ్మాయి తన చున్నీ ఇచ్చి పట్టుకొమ్మని చెప్పి పైకి లాగుతోంది. అతను పైకి వస్తే.. ఇద్దరు కలుస్తారు.. ప్రేమ బతుకుతుంది. ఇది అన్ని సినిమాల్లో ఊహించే క్లైమాక్సే కానీ, అది కొంచెం మారుద్దామని నాగ్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ” ఇలాంటి క్లైమాక్స్ మనం బోల్డ్ చూసాం కదా .. ఎండింగే మార్చేద్దాం.. ఇది అంతం కాదు ఆరంభం” అని చెప్పగానే వెంటనే ఆ అమ్మాయి తుమ్మడం.. చేతిలో చున్నీ జారడం.. ప్రియుడు కళ్ళముందే కింద పడిపోవడం జరిగిపోతుంది. ఎవరి ఊహకు అందని సీజన్..బిగ్ బాస్ సీజన్ 7.. అంతా ఉల్టా.. పూల్టా అంటూ నాగ్ డైలాగ్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇక ఈ ప్రోమోను బట్టి ఈసారి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!