బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మొక్కలు నాటాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులైన షన్ను, సిరి, శ్రీరామ చంద్రకు ఈ ఛాలెంజ్ ని విసిరారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మరి సన్నీ ఛాలెంజ్ ని షన్ను, సిరి , శ్రీరామ చంద్ర స్వీకరిస్తారో లేదో చూడాలి.
షన్నుకు కొత్త ఛాలెంజ్ విసిరిన సన్నీ..

sunny