Site icon NTV Telugu

బిగ్ బాస్ 5 : విజేత అతడే.. లీక్ అయిన ఓటింగ్

bigboss

భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. టాస్క్ లు , ఎలిమినేషన్లు, గొడవలు, ప్రేమలు ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో కంటెస్టెంట్లను బిగ్ బాస్ చూపించారు. ఇక ఈ సీజన్ చివరి దశకు చేరుకొంది. ఎవరో ఒకరు ట్రోఫీ గెలిచే సమయం వచ్చేసింది. ఐదుగురు ఫైనలిస్టుల మధ్య ఒకే ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో వారు స్టేజిపై అతిరధ మహారథుల చేతుల మీద ట్రోఫీని అందుకోనున్నారు. అయితే ఎవరా విన్నర్.. ఎవరు రూ.50 లక్షల ప్రైజ్‌మనీని అందుకోబోతున్నారు అంటే.. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ నిలిచినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి షన్నుకు , సన్నీకి మధ్య గట్టి పోటీ నెడుతున్న విషయం తెలిసిందే. సున్ని గేమ్ ఆడే విధానము, ఫ్రెండ్స్ కి ఇచ్చే విలువా , అభిమానులకు పంచె వినోదం.. వెరసి సన్నీని విన్నర్ గా నిలబెట్టాయని తెలుస్తోంది.

ఇక చివరి వారం ఓటింగ్ లో సన్నీకి 34 శాతం ఓట్లు రాగా షన్నూ కు 31 శాతం ఓట్లు నమోదు అయ్యాయట. ఆ తర్వాత స్థానంలో శ్రీరామ చంద్ర ఉన్నాడు. నాల్గవ స్థానంలో అంతా ఊహించినట్లుగా మానస్.. చివరి స్థానంలో సిరి నిలిచిందని తెలుస్తోంది. మొన్నటి వరకు సన్నీని దాటుకొని ఓటింగ్ లో ముందంజలో ఉన్న షన్ను కొన్ని టాస్క్ లో ఫేక్ గా కనిపించడం, సన్నీని బ్లేమ్ చేయాలనీ చూడడం, కంటెస్టెంట్ల వెనక సిరితో వారి గురించి మాట్లాడం ప్రేక్షకులను నచ్చలేదు.. సన్నీ కొద్దిగా ఆటల్లో వెనక ఉన్నా అతను మొదటి నుంచి నిజాయితీగా ఆడడం, అతడి ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ హౌస్ లో వినోదాన్ని పంచడంతో అభిమానులు సన్నీకి ఫిదా అయ్యారు. టాస్క్ ల్లో అద్బుతంగా పాల్గొనడంతో పాటు ప్రతి ఒక్క సందర్బంలో కూడా తన యొక్క హుందాతనంను ప్రదర్శించాడు. ప్రతి ఒక్కరికి నచ్చే కంటెస్టెంట్ అంటూ సన్నీ పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మహిళలు సన్నీని తమ ఇంట్లో బిడ్డగా అనుకొంటున్నారు. అందుకె సన్నీ విన్నర్ గా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చివరి ఎపిసోడ్ లో నాగ్ మునపటిలానే కంటెస్టెంట్ల మనోభావాలను తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. రూ. 25 లక్షల బాక్స్ ని ఇచ్చి వారిలో ఒకరిని బయటికి రావాల్సిందిగా కోరితే ఎవరు బయటికి వస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ క్యాష్ ఆఫర్ ని సిరి చేజిక్కించుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరామ్, మానస్ కొద్దిగా ఈ ఆఫర్ ని తిరస్కరించే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక సన్నీకి, షన్నుకి కూడా ఇదే ఆఫర్ ని అందించడంతో ఏ ఒక్కరు ఈ అవకాశాన్ని అందుకోరు అని పక్కాగా చెప్పొచ్చు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిపోయిందట. ఈ ఫైనల్ ఈవెంట్ కి బ్రహ్మస్త్ర టీమ్, దర్శక ధీరుడు రాజమౌళి హాజరవుతున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, కరణ జోహార్ స్టేజిపై నాగ్ తో కలిసి సందడి చేయనున్నారు. అయితే విన్నర్ కి మాత్రం ఎవరి చేతుల మీద నుంచి ఇవ్వనున్నారనేది తెలియాల్సి ఉంది. చాలామంది రాజమౌళి చేతుల మీదగాని ట్రోఫీ బహుకరిస్తారని అంటున్నారు. మరి ఈ ఆఫీషియల్ ఈవెంట్ ని చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి..

Exit mobile version