Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’ మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. 16 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్‌లో ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్లు కూడా జరిగిపోయాయి. నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న ఈ సీజన్‌లో గొడవలు, టాస్కులు, నామినేషన్లతో పాటు కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు? సెలబ్రిటీలకు వారానికి ఎంత చెల్లిస్తున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్‌కు వారి క్రేజ్‌ను బట్టి పారితోషికం ఉంటుందన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు, అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ కు వేర్వేరు స్థాయిల్లో పేమెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో, పలు మీడియా కథనాల్లో సమాచారం వైరల్ అవుతోంది. అయితే ఈ మొత్తాలను బిగ్ బాస్ టీమ్ ఆఫీషియల్ గా అయితే ధృవీకరించలేదు.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ ఈ సీజన్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న కంటెస్టెంట్లలో ముందున్నారట. ఆయనకు వారానికి సుమారు రూ.4.5 లక్షల పారితోషికం అందుతున్నట్లు సమాచారం. ఆయన తర్వాత యాంకర్ వర్షిణికి వారానికి సుమారు రూ.3.5 లక్షలు, ముకేష్ గౌడకు రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నటుడు కృష్ణుడికి వారానికి సుమారు రూ.2 లక్షలు, టెంపర్ వంశీకి రూ.2 లక్షలు, దేబ్జానీ మోదక్‌కు రూ.2.75 లక్షలు, చైత్ర రాయ్‌కు రూ.2.5 లక్షలు, పొట్టి నరేష్‌కు రూ.2.5 లక్షలు, సుధీర్ రెడ్డికి సుమారు రూ.1.25 లక్షలు అందుతున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఆదిత్ అరుణ్‌కు వారానికి సుమారు రూ.2.75 లక్షలు అందుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
సెలబ్రిటీలతో పోలిస్తే అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కామనర్లకు తక్కువ పారితోషికం అందుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కామన్ కంటెస్టెంట్లకు వారానికి సుమారు రూ.70 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. అంటే వారు హౌస్‌లో ఎక్కువ వారాలు కొనసాగితే, వారాల సంఖ్యను బట్టి వారి మొత్తం పారితోషికం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో తొలి మిడ్ వీక్ ఎలిమినేషన్‌గా కామన్ కంటెస్టెంట్ ఆర్జే చరణ్ బయటకు వెళ్లారు. ఆ తర్వాత చైత్ర రాయ్ కూడా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి, అయితే ఆమె విషయంలో రీఎంట్రీ లేదా సీక్రెట్ రూమ్‌కు సంబంధించిన ట్విస్టులు ఉంటాయనే ప్రచారం కూడా సాగింది. అయితే నిన్న నాగార్జున సీక్రెట్ రూమ్ లో లేనట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న మొత్తాల ప్రకారం ఆటో రామ్ ప్రసాద్ 4.5 లక్షల పారితోషికంతో టాప్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక షో ముందుకు వెళ్లే కొద్దీ ఎవరు ప్రేక్షకుల మనసులు గెలుచుకుని ఎక్కువ వారాలు హౌస్‌లో కొనసాగుతారో, చివరకు టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్ మనీని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

