Bigg Boss Agnipariksha Promo : బిగ్ బాస్ సీజన్-9 కోసం కామన్ మ్యాన్ కోటాలో ముగ్గురిని పంపేందుకు అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఇక రెండో ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా మంది కంటెస్టెంట్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. అసలు బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు రకరకాలుగా వయవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ముందు నిరాహార దీక్ష చేసిన మల్టీస్టార్ మన్మద రాజా అయితే మొదటి ఎపిసోడ్ లో ఓ రేంజ్ లోఏడ్చేశాడు. సింపతీ చూపిస్తే లోపలకు పంపిస్తారని తెగ ఏడవడం చూసి జడ్జిలు నవదీప్, అభిజీత్, బిందు మాధవి అతన్ని ఎలిమినేట్ చేసేశారు. ఇక తాజాగా రెండో ఎపిసోడ్ లో ఓ లేడీ కంటెస్టెంట్ మరీ దారుణంగా చేసింది. ముఖానికి పేడ రాసుకోమని చెప్పగానే వెంటనే బుగ్గలకు రాసేసుకుంది.
Read Also : Gharana Mogudu : ‘ఘరానా మొగుడు’ మూవీకి చిరు రికార్డ్ రెమ్యునరేషన్..
అది చూసిన వారంతా ఇదేం పిచ్చి రా బాబు అనుకుంటున్నారు. ఇంక మరో లేడీ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ స్టేజీపై కాస్త అతిగా ప్రవరించింది. పెద్ద పెద్దగా అరిచేసింది. అది విన్న శ్రీముఖి.. పిల్ల ఇలా అరిస్తే అందరూ టీవీలు ఆఫ్ చేస్తారు అని సెటైర్ వేసింది. అలా అయితే నువ్వు మూడో సీజన్ లో ఉన్నప్పుడే కట్ చేయాలి అంటూ శ్రీముఖికే కౌంటర్ వేసింది శ్రీజ. దీంతో జడ్జి అభిజిత్ ఆమెకు రెడ్ కార్డు చూపించాడు. శ్రీజ మరింత రెచ్చిపోయింది. నా లాంటి పవర్ ఫుల్ కంటెస్టెంట్ ను హ్యాండిల్ చేయలేక రెడ్ కార్డు చూపిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. దీంతో కాసేపు రచ్చ రచ్చ కనిపించింది. మరో ప్రోమోలో గొంగడి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత పాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతను తన పనులతో ఎప్పటికప్పుడు అలరిస్తున్నాడు. చూస్తుంటే లోపలకు వెళ్లేలా కనిపిస్తున్నాడు.
Read Also : Chiranjeevi : చిరంజీవి పేరును అందుకే టైటిల్ గా పెట్టా.. అనిల్ కామెంట్స్
