Site icon NTV Telugu

Bigg Boss Non Stop : వీక్షకులకు నిరాశ… ఆగిపోయిన షో

Bigg-Boss-Non-Stop

గత ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్న “బిగ్ బాస్” షో ఇప్పుడు “బిగ్ బాస్ నాన్ స్టాప్” అంటూ కొత్త వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయింది. 84 రోజుల పాటు, 24 గంటల పాటు 17 మంది కంటెస్టెంట్లతో ప్రసారమవుతున్న షోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. కొత్త వాళ్ళను ఒక గ్రూప్ గా, పాత వాళ్ళను ఓ గ్రూప్ గా విడదీసి, వాళ్ళ మధ్య ఆసక్తికర టాస్కులు పెడుతున్నారు. హాట్ స్టార్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షోను రోజుకు రెండు ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు. అయితే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని ప్రేక్షకులు మంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో షోను మొత్తానికే ఆపేసి వీక్షకులకు షాక్ ఇచ్చారు మేకర్స్.

Read Also : Harish Shankar : గుర్తు పెట్టుకోండి… టైం వచ్చినప్పుడు చెప్తా…

తాజాగా “బిగ్ బాస్ నాన్ స్టాప్” లైవ్ స్ట్రీమింగ్‌ను బుధవారం అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిలిపి వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించింది. సడన్ గా షో నిలిచిపోవడంతో అసలేం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో పడ్డారు వీక్షకులు. షోను ఇలా అర్థాంతరంగా ఆపడానికి గల కారణమేంటో హాట్ స్టార్ వెల్లడించలేదు. కానీ మళ్లీ గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి రీస్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం షోను లైవ్ లా కాకుండా ఒక గంట ఆలస్యంగా ప్రసారం చేస్తూ, రోజూ నైట్ ఓ ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారట. ఇదంతా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే అంటున్నారు.

Exit mobile version