Bigg Boss Non Stop : వీక్షకులకు నిరాశ… ఆగిపోయిన షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్న “బిగ్ బాస్” షో ఇప్పుడు “బిగ్ బాస్ నాన్ స్టాప్” అంటూ కొత్త వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయింది. 84 రోజుల పాటు, 24 గంటల పాటు 17 మంది కంటెస్టెంట్లతో ప్రసారమవుతున్న షోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. కొత్త వాళ్ళను ఒక గ్రూప్ గా, పాత వాళ్ళను ఓ గ్రూప్ గా విడదీసి, వాళ్ళ మధ్య ఆసక్తికర టాస్కులు పెడుతున్నారు. హాట్ స్టార్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోను రోజుకు రెండు ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు. అయితే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని ప్రేక్షకులు మంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో షోను మొత్తానికే ఆపేసి వీక్షకులకు షాక్ ఇచ్చారు మేకర్స్.
Read Also : Harish Shankar : గుర్తు పెట్టుకోండి… టైం వచ్చినప్పుడు చెప్తా…
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజాగా “బిగ్ బాస్ నాన్ స్టాప్” లైవ్ స్ట్రీమింగ్‌ను బుధవారం అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిలిపి వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించింది. సడన్ గా షో నిలిచిపోవడంతో అసలేం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో పడ్డారు వీక్షకులు. షోను ఇలా అర్థాంతరంగా ఆపడానికి గల కారణమేంటో హాట్ స్టార్ వెల్లడించలేదు. కానీ మళ్లీ గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి రీస్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం షోను లైవ్ లా కాకుండా ఒక గంట ఆలస్యంగా ప్రసారం చేస్తూ, రోజూ నైట్ ఓ ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారట. ఇదంతా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే అంటున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!