NTV Telugu Site icon

Bigg Boss Non Stop : ఈ వారం కమెడియన్ అవుట్

Bigg-Boss-Non-Stop

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్‌ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు కంటెస్టెంట్లు అఖిల్, బిందుమాధవి మధ్య ఈక్వేషన్స్ ఫ్రెండ్స్ అయినట్టు కన్పిస్తోంది. టాస్క్‌లు, నామినేషన్‌ల విషయంలో అఖిల్‌, బిందు తరచుగా గొడవ పడుతుంటారు. అయితే ఏడో వారం టాస్క్‌లలో బిందు, అఖిల్‌లు కలిసి ఆడారు. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ వీకెండ్ వచ్చేసింది. ఆసక్తికరమైన ఎలిమినేషన్ రౌండ్ ఈరోజు ఉండబోతోంది.

Read Also : Shekar: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన యాంగ్రీ యంగ్ మ్యాన్

ఈ వారం నామినేషన్లలో మహేష్ విట్టా, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అనిల్‌, అఖిల్‌, అరియానా ఉన్నారు. ఇందులో బిందు, అఖిల్ భారీ ఓట్లతో దూసుకెళ్తుండగా… అరియనా, శివ, మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్ సేఫ్ అని తెలుస్తోంది. ఇక మిగిలింది అనిల్, మహేష్… అయితే గత సీజన్ లో పాల్గొన్న మహేష్ ఓటిటి వెర్షన్ లో గేమ్ బాగా ఆడుతూ, కంటెస్టెంట్లకు గట్టి పోటీని ఇస్తున్నాడు. షోను రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు మహేష్ టాప్ 5 లో ఉంటాడని భావిస్తుండగా, బిగ్ బాస్ నాన్ స్టాప్ మేకర్స్ మాత్రం అతన్ని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంతో ఆదివారం సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Show comments