Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ అంటే కేవలం ఇంట్లో జరిగే గొడవలు, టాస్కులు, ఎలిమినేషన్లు మాత్రమే కాదు.. ప్రతి వారం ప్రేక్షకులను టీవీ ముందు కూర్చోబెట్టే హోస్ట్ కూడా ఈ షోలో చాలా కీలకం. కంటెస్టెంట్ల ఆటను విశ్లేషించడం, తప్పు చేసినవారిని నిలదీయడం, వీకెండ్ ఎపిసోడ్స్‌ను నడిపించడం ఇలా హోస్ట్ బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. అందుకే బిగ్ బాస్ హోస్ట్‌లకు భారీ పారితోషికాలు చెల్లిస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో సల్మాన్ ఖాన్ నుంచి నాగార్జున, విజయ్ సేతుపతి, మోహన్‌లాల్ వరకు ఎవరు ఎంత తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు ముందువరసలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ బిగ్ బాస్‌కు సీజన్ 4 నుంచి హోస్ట్‌గా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ పారితోషికంపై ప్రతి సీజన్లోనూ రకరకాల వార్తలు వస్తుంటాయి. తాజా రిపోర్టుల ప్రకారం బిగ్ బాస్ 20 కోసం ఆయనకు సుమారు రూ.200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ఇక బిగ్ బాస్ బంగ్లా విషయానికి వస్తే మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ ఎడిషన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు నాలుగేళ్ల పాటు సుమారు రూ.125 కోట్ల విలువైన ఒప్పందం కుదిరిందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది బిగ్ బాస్ బంగ్లా ఒక్కటికి సంబంధించిన రెమ్యునరేషన్ కాదని, మరో క్విజ్ షో కూడా ఈ డీల్‌లో భాగమని సమాచారం.
ఇక తమిళ బిగ్ బాస్‌కు కమల్ హాసన్ తర్వాత విజయ్ సేతుపతి హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఒక్కో వీకెండ్‌కు సుమారు రూ.3 నుంచి రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లు, మొత్తం సీజన్‌కు రూ.75 నుంచి రూ.80 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన దక్షిణాది బిగ్ బాస్ హోస్ట్‌లలో విజయ్ సేతుపతి కూడా అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో ఒకరిగా నిలుస్తున్నారు.
తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే అక్కినేని నాగార్జునకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2019లో సీజన్ 3తో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన పారితోషికం అప్పటితో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది ప్రారంభంలో సుమారు రూ.10 కోట్లుగా ఉన్న ఆయన రెమ్యునరేషన్ ప్రస్తుతం దాదాపు రూ.35 కోట్లకు చేరినట్లు సమాచారం.
మలయాళ బిగ్ బాస్‌కు మొదటి సీజన్ నుంచే హోస్ట్‌గా ఉన్న మోహన్‌లాల్ కూడా భారీ పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయనకు సుమారు రూ.12 కోట్ల పారితోషికం ఉండగా, ప్రస్తుతం ఒక్క సీజన్‌కు దాదాపు రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు అయితే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కన్నడ బిగ్ బాస్‌కు కిచ్చా సుదీప్ మొదటి సీజన్ నుంచే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్క సీజన్‌కు సుమారు రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలా చూస్తే బిగ్ బాస్ ఫ్రాంచైజీలో హోస్ట్‌ల స్టార్ పవర్‌కు ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, నాగార్జున, మోహన్‌లాల్, సుదీప్ వంటి స్టార్ హీరోలు షోను హోస్ట్ చేయడం మాత్రమే కాకుండా తమ క్రేజ్‌తో ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తున్నారు. అందుకే వీరి పారితోషికాలు కూడా కోట్లలోనే ఉంటున్నాయి.
అయితే ఈ రిపోర్టులు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఆధారంగా వచ్చినవే. ఆయా నటులు లేదా బిగ్ బాస్ మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి ఈ గణాంకాలను ఖచ్చితమైన రెమ్యునరేషన్ గా కాకుండా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నివేదికలుగా మాత్రమే చూడాలి.
తాజావార్తలు
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!