బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు నుంచే ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారు? ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగిపోయింది.
Also Read : Prabhas : ఫేక్ న్యూస్‌తో మోసపోయిన ప్రభాస్ ఫ్యాన్స్..
ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం సెలబ్రిటీలే కాకుండా కామన్ మ్యాన్ కూడా కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌లో 9 మంది సెలబ్రిటీలు, మిగతా 9 మంది సాధారణ వ్యక్తులని టాక్. వారిని ఎంపిక చేసుకోవడానికే ప్రత్యేకంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నిర్వహిస్తున్నారు. ఆ షోలో ప్రస్తుతం 15 మంది పాల్గొంటుండగా, వారిలో ఐదుగురికి బిగ్ బాస్ సీజన్ 9 లో అవకాశం దక్కనుందని సమాచారం. మిగిలిన స్థానాలు ఎలా భర్తీ అవుతాయి అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అంతే కాదు, బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో రెడీ అయిందట. కిచెన్, లివింగ్ ఏరియా ఒకేలా ఉంటాయి కానీ రూమ్స్ మాత్రం రెండు లేదా నాలుగు సెపరేట్ సెక్షన్స్‌లో ఉంటాయని తెలుస్తుంది. అంతే కాదు, ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా గదులు ఉంటాయట. ఎవరిని పై అంతస్తులో ఉంచుతారు? ఎవరిని కింద ఉంచుతారు? అన్నది కంటెస్టెంట్స్ మధ్య స్ట్రాటజీ, రగడలకు కారణం అవుతుందని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 ను మరింత రసవత్తరంగా మార్చేందుకు రణరంగం కాన్సెప్ట్ ని ఫుల్‌గా అమలు చేస్తున్నట్టు అర్ధమవుతుంది. ఈసారి నాగార్జున కూడా డబుల్ ఎనర్జీతో షోని నడిపించబోతున్నారట. ప్రేక్షకులు ఇప్పటికే బిగ్ బాస్ ఫీవర్‌లోకి వెళ్లిపోయారు. ఇక మిగిలింది ఒక్క వారం మాత్రమే.. ఆ తర్వాత మూడు నెలల పాటు ఎంటర్టైన్మెంట్ పండగ మొదలవుతుంది. మొత్తంగా చూస్తే, బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్ కంటే ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉండబోతోందని చెప్పొచ్చు. మరి ఈ సీజన్‌లో ఎవరు ఆడియన్స్ మనసులు గెలుస్తారు? ఎవరు చివరికి టైటిల్ కొడతారు? అనేది చూడాలి.
