Site icon NTV Telugu

Bigg Boss 6: సింగర్ రేవంత్ ఇంట్లో సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అన్విత

Singer Revanth

Singer Revanth

Bigg Boss 6: తెలుగు స్టార్ సింగర్, బిగ్‌బాస్ -6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. రేవంత్ భార్య అన్విత శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయంలో అన్విత నిండు గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఇంకా అతడు హౌస్‌లోనే ఉన్నాడు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాదాపు రేవంత్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేవంత్‌కు ఈ వీకెండ్‌లో బిగ్‌బాస్ ఈ హ్యాపీ న్యూస్ చెప్పనున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అతడికి అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

Read Also: Salaar: ఈ యాక్షన్ ఎపిక్ అనౌన్స్ అయ్యి రెండేళ్లు…

కాగా తాను చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయానని.. అందుకే తాను డాడీ అనిపించుకోవాలని ఉందని బిగ్‌బాస్ హౌస్‌లో రేవంత్ పలుమార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్యామిలీ టైంలో ఆదిరెడ్డి కూతురు హౌస్‌లోకి వచ్చిన సమయంలో రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అన్విత గర్భిణీగా ఉన్న సమయంలో ఆమెను వదిలివచ్చానని ఇతర కంటెస్టెంట్లతో చెప్పుకుని బాధపడ్డాడు. అతడు హౌస్‌లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను హౌస్‌లో ప్లే చేసి రేవంత్‌ను బిగ్‌బాస్ హ్యాపీ చేశాడు. ఇప్పుడు తనకు పాప పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలను పాడిన రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Exit mobile version